అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. తెదేపా కౌన్సిలర్లు రహస్య శిబిరం నుంచి తెల్లవారుజామున తాడిపత్రి చేరుకున్నారు. తెదేపాకు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతిస్తున్న కారణంగా.. ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులను వెంటబెట్టుకుని తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి పట్టణానికి వెళ్లారు. ఎన్నికల ఫలితాల్లో తెదేపాకు 18, వైకాపాకు 16 మంది కౌన్సిలర్లు దక్కారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్దతుతో తెదేపా బలం 20కి చేరింది. వైకాపాకు అదనంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య ఎక్స్‌అఫీషియో సభ్యులున్నారు. వారితో కలిపి వైకాపా బలం 18కి చేరింది. మరికాసేపట్లో కౌన్సిలర్ల పదవీ స్వీకారం అనంతరం.. ఛైర్మన్ ఎన్నిక జరగనుంది.
జిల్లా వ్యాప్తంగా పది మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థలో.. ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, మేయర్, ఉప మేయర్ల ఎన్నిక జరగనుంది. సభ్యులందర్నీ ఎన్నుకున్న తరువాత ఛైర్మన్లు, మేయర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇదీ చూడండి: