ETV Bharat / state

కౌన్సిల్ సమావేశాన్ని బాయ్​కాట్ చేసిన తెదేపా - హిందూపురంలో తెదేపా కౌన్సిలర్లు బైకాట్

హిందూపురంలో కౌన్సిల్ సమావేశాన్ని తెదేపా కౌన్సిల్ సభ్యులు బాయ్​కాట్ చేశారు. అధికార పార్టీ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు.

కౌన్సిల్ సమావేశాన్ని బైకాట్ చేసిన తెదేపా కౌన్సిలర్లు

author img

By

Published : Jun 22, 2021, 10:19 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం కౌన్సిల్ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులు బాయ్​కాట్ చేశారు. అధికార పార్టీ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోందని కౌన్సిల్ సమావేశంలో తెదేపా కౌన్సిలర్లు కింద కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గెలుపొందిన వార్డుల్లో అభివృద్ధి పనులు చేయడం లేదని.. ప్రశ్నించే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ గెలుపొందిన ఆరు వార్డుల్లో వైకాపా ఇంఛార్జ్​లను నియమించి వారి ద్వారా పనులు చేయించడం సమంజసం కాదని ఛైర్​పర్సన్​ను ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యబద్దంగా గెలుపొందిన మమ్మల్ని పక్కనపెట్టి ఇంఛార్జీల ద్వారా పనులు చేయించడం సబబు కాదని సూచించారు. తమ సమస్యలను పరిష్కరించి తెలుగుదేశం పార్టీ సభ్యులు గెలుపొందిన వార్డులలో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయాలపై తర్వాత చర్చిస్తామని.. ఇప్పుడు సమయం కాదని చైర్​పర్సన్ తెలిపారు. ఎంతసేపటికి సభ్యులను పట్టించుకోకపోవడంతో.. కౌన్సిల్ సమావేశాన్ని ఆరుగురు తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ సభ్యులు బాయ్​కాట్ చేశారు.

ఇదీ చదవండి:

YSR cheyutha: కుటుంబానికి మహిళలే రథసారధులు: సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.