Uravakonda Farmers: నష్టపోయిన వివిధ పంటలకు బీమాను వర్తింప చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరులో జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. ధర్నా చేసిన రైతులపై అనంతపురం జిల్లా ఉరవకొండ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ ధర్నాలో పాల్గొన్న రైతులు, టీడీపీ నాయకులు నెట్టెం రాంబాబు, సుభాస్ చంద్రబోస్, యర్రగుంట్ల వెంకటేష్, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు ప్యారం భరత్‌తో పాటు మరో ఐదుగురు రైతులపై కేసులు నమోదు అయ్యాయి. ఉరవకొండ మండలంలో పోలీసు చట్టం 30 అమల్లో ఉందనీ.. ముందస్తు అనుమతులు లేకుండా రైతులు ధర్నా చేశారన్న కారణంతో అర్బన్ సీఐ హరినాథ్ వారిపై 341 మరియు 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసు కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు మంగళవారం రాత్రి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రైతుల అరెస్ట్ నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, రైతుల అరెస్ట్‌పై స్పందించారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు: నష్టపోయిన పంటకు పరిహారం అడిగిన అన్నదాతలపై కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వ అహంకారానికి, రైతు వ్యతిరేక పోకడలకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా కోసం రోడ్డెక్కారని ఉరవకొండలో రైతులపై కేసులు పెట్టడం సిగ్గు చేటన్నారు. వైసీపీ నాలుగేళ్ల పాలనలో... సాగు సబ్సిడీలు లేవు.. గిట్టుబాటు ధరలు లేవు.. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు లేవన్న చంద్రబాబు.. ఉన్నది కేవలం ప్రశ్నించిన రైతన్నలపై కేసులు మాత్రమేనని ఆక్షేపించారు. రైతుకు కష్టం వచ్చిన ప్రతిసారీ తెలుగుదేశం ప్రభుత్వం బాసటగా నిలిచిందని చంద్రబాబు గుర్తు చేసారు. విపత్తులు, కరువు సమయాల్లో రైతును ఆదుకునేందుకు ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పాలసీలు తెచ్చి రెతులకు అండగా నిలబడ్డినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ముగిసిన వ్యవసాయ సంవత్సరంలో పంటలకు ఎంత బీమా కట్టారో, ఎంత నష్టం జరిగిందో... ఎంత మంది రైతులకు ఎంత పరిహారం చెల్లించారో.. వివరాలు చెప్పగలరా అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంటలకు ఇన్సూరెన్స్ అంశంపై సాక్షాత్తూ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పి, రైతులను వంచించి దొరికిపోయిన వైసీపీ నేడు రైతులపైనే కేసులు పెట్టి అరాచకానికి అడ్రస్‌గా మారారని మండిపడ్డారు. కేసులు పెట్టినందుకు అన్నదాతలకు క్షమాపణ చెప్పి... బీమా సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు డిమాండ్ చేసారు.
-
నష్టపోయిన పంటకు పరిహారం అడిగిన అన్నదాతలపై అనంతపురం జిల్లాలో కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వ అహంకారానికి, రైతు వ్యతిరేక పోకడలకు నిదర్శనం. బీమా కోసం రోడ్డెక్కారని ఉరవకొండలో రైతులపై కేసులు పెట్టడం సిగ్గు చేటు. మీ పాలనలో నాలుగేళ్లుగా సాగు సబ్సిడీలు లేవు... గిట్టుబాటు ధరలు… pic.twitter.com/qZTGY1UTJm
— N Chandrababu Naidu (@ncbn) July 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">నష్టపోయిన పంటకు పరిహారం అడిగిన అన్నదాతలపై అనంతపురం జిల్లాలో కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వ అహంకారానికి, రైతు వ్యతిరేక పోకడలకు నిదర్శనం. బీమా కోసం రోడ్డెక్కారని ఉరవకొండలో రైతులపై కేసులు పెట్టడం సిగ్గు చేటు. మీ పాలనలో నాలుగేళ్లుగా సాగు సబ్సిడీలు లేవు... గిట్టుబాటు ధరలు… pic.twitter.com/qZTGY1UTJm
— N Chandrababu Naidu (@ncbn) July 5, 2023నష్టపోయిన పంటకు పరిహారం అడిగిన అన్నదాతలపై అనంతపురం జిల్లాలో కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వ అహంకారానికి, రైతు వ్యతిరేక పోకడలకు నిదర్శనం. బీమా కోసం రోడ్డెక్కారని ఉరవకొండలో రైతులపై కేసులు పెట్టడం సిగ్గు చేటు. మీ పాలనలో నాలుగేళ్లుగా సాగు సబ్సిడీలు లేవు... గిట్టుబాటు ధరలు… pic.twitter.com/qZTGY1UTJm
— N Chandrababu Naidu (@ncbn) July 5, 2023
పోలీసులు స్పందించకుంటే జైల్ భరో: మరోవైపు రైతులపై కేసులు పెట్టిన విషయం తెలుసుకున్న తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్... ఉరవకొండ పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. శనివారం లోపు కేసుల్ని వెనక్కి తీసుకోని పక్షంలో రైతులతో కలిసి జైల్ భరో కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.