కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన అనంతపురం జిల్లా రైతులకు ప్రత్యేక ప్రోత్సహకాలు అందించాలని తెదేపా, సీపీఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రస్తుతం వేరుశనగ విత్తన పంపిణీతో పాటు, రుణాల రీషెడ్యూల్ పై మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు, తెదేపా జిల్లా అధ్యక్షుడు పార్థసారధి, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడును కలసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రైతుకు నాలుగు బస్తాల వేరుశనగ మాత్రమే ఇస్తున్నారని.. ఐదు ఎకరాలకు సరిపడా విత్తనం అందించాలన్నారు. సబ్సిడీని కూడా 40 నుంచి 60శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. పంట రుణాల పరపతిని పెంచడంతో పాటు ఆటోమేటిక్గా రుణాలు రెన్యూవల్ అ్యయేలా చూడాలని కోరారు.
ఇదీ చూడండి తెదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు