ETV Bharat / state

తూంపల్లి భూముల పరిశీలనకు టీడీపీ నేతలు..అడ్డుకున్న పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

TDP agitation against Minister Bhudanda : భూ అక్రమాలను నిరూపించాలంటూ మంత్రి ఉష శ్రీచరణ్ సవాలుకు ప్రతిగా తూంపల్లి భూముల పరిశీలనకు తెలుగుదేశం పిలుపునివ్వగా.. నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలువురు నాయకులకు ముందస్తు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు. పోలీసుల అడ్డగింతతో అనంతపురంలో తోపులాట చోటు చేసుకుంది.

TDP agitation
టీడీపీ ఆందోళన
author img

By

Published : Jan 21, 2023, 9:10 PM IST

Updated : Jan 22, 2023, 8:45 AM IST

టీడీపీ ఆందోళన

భూఅక్రమాలను నిరూపించాలంటూ మంత్రి ఉష శ్రీచరణ్ సవాలుకు స్పందించిన టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తూంపల్లి భూముల పరిశీలనకు తెలుగుదేశం పిలుపునివ్వగా.. టీడీపీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలువురు నాయకులకు ముందస్తు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు. పోలీసుల అడ్డగింతతో అనంతపురంలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.

అడ్డుకున్న పోలీసులు : తూంపల్లి సుజలాన్‌ పవన విద్యుత్ పార్కు ఏర్పాటుకు ఇచ్చిన 120 ఎకరాల భూములను.. ఆ సంస్థ నుంచి కొనుగోలు చేసి స్థానిక రైతులకు డబ్బులివ్వకుండా మంత్రి రిసార్టు ఏర్పాటు చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. మట్టి, ఇసుకను సైతం రిసార్ట్‌కు అక్రమంగా తరలిస్తున్నారన్న విమర్శలపై స్పందించిన మంత్రి ఉష శ్రీచరణ్.... ఎలాంటి అ్రకమాలకు పాల్పడలేదని, ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు సరేనన్న తెలుగుదేశం నేతలు... భూముల పరిశీలనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. తూంపల్లి వెళ్లేందుకు బయల్దేరిన నేతలను జిల్లా తెదేపా కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణదుర్గం ఇన్‌ఛార్జి ఉమమహేశ్వరనాయుడు, మాజీ మంత్రి నిమ్మల కిష్టప్పను అరెస్ట్ చేశారు.

గృహ నిర్భంధం : మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని గృహ నిర్బంధం చేశారు. తెదేపా నేత మారుతి చౌదరిని కళ్యాణదుర్గం మండలంలో అదుపులోకి తీసుకొన్న పోలీసులు... వాహనంలోనే పలుచోట్ల తిప్పారు. అవినీతి మంత్రి ఉషశ్రీచరణ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.

హనుమంతరాయ చౌదరి బంక్ వద్ద కొలతలు : మంత్రి ఉష శ్రీచరణ్‌ భూదందాకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేసిన మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి చెందిన పెట్రోల్‌బంక్‌ వద్ద కొలతలు వేసేందుకు అధికారులు యత్నించారు. దీనిపై స్పందించిన తెలుగుదేశం నేతలు... ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.

ఇవీ చదవండి :

Last Updated : Jan 22, 2023, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.