అనంతపురంలోని అన్న క్యాంటీన్ వద్ద తెదేపా కార్యకర్తలు నిరనస తెలిపారు. అన్న క్యాంటీన్లు తెరవాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు రాగి సంగటి పంపిణీ చేశారు. 'సన్న బియ్యం వద్దు.. రాగి సంగటి అయినా పెట్టు జగన్ స్వామీ' అంటూ నినాదాలు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమాన్ని మరచి ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ సమయంలో అన్న క్యాంటీన్లు ఉంటే పేదల కడుపు నింపడానికి ఆసరాగా ఉండేవని అభిప్రాయపడ్డారు. పేదలకు అన్నం పెట్టిన ఈ అన్నా క్యాంటీన్లలోనే వైకాపా ప్రభుత్వం కొన్ని చోట్ల అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపుతుందని ఆరోపించారు. వెంటనే క్యాంటీన్లు తెరిచి పేద ప్రజలకు అన్నం పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: