MLC Mohd. Iqbal: గ్రామానికి రోడ్డు వేస్తామన్న హామీ నెరవేర్చలేదంటూ అనంతపురం జిల్లా హిందూపురంలో వైకాపా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఇంటిని గ్రామస్థులు ముట్టడించారు. చిలమత్తూరు మండలం తమ్మినాయనపల్లి గ్రామానికి రోడ్డు వేస్తామంటూ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్... 8 నెలల క్రితం హామీ ఇచ్చారని గ్రామస్థులు చెబుతున్నారు. ఇప్పటికీ గ్రామానికి రోడ్డు వేయలేదని...రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులు ఇంటికి చేరుకునే సమయానికి ఎమ్మెల్సీ లేకపోవడంతో ఇంటి ముందే బైఠాయించారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చదవండి: