ETV Bharat / state

'శారదాపీఠం ధర్మం కోసం పోరాడుతుంది' - శారదా పీఠంపై స్వాత్మ నందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు

విలువలు లేని వాళ్లే విశాఖ శారదా పీఠం గురించి ఆరోపణలు చేస్తారని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. శారదా పీఠం భారతదేశంలో విలక్షణమైనది, విశిష్టమైనదని చెప్పారు.

swathma nandendra saraswathi on tungabadhra pushkara
స్వాత్మ నందేంద్ర సరస్వతి
author img

By

Published : Nov 22, 2020, 9:45 AM IST

విలువలులేని రాజకీయ నాయకులు తమ పీఠంపై ఆరోపణలు చేయడం దురదృష్ణకరమని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి అన్నారు. దేశవ్యాప్తంగా విశాఖ శారదాపీఠం విశిష్టత కలిగిన పీఠమని పేర్కొన్నారు. శారదాపీఠం ధర్మం కోసం పోరాడుతుందని, వ్యక్తి, రాజకీయపార్టీల కోసం కాదన్నారు. శనివారం అనంతపురంలో స్వాత్మ నందేంద్ర సరస్వతి పర్యటించారు.

భారతీయ సనాతన సంప్రదాయాల్లో ముఖ్యమైనవి నదులు, తీర్థాలని.. వాటిని కాపాడుకోవాలని స్వాత్మానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న సమయంలో తుంగభద్ర పుష్కరాలు రావడం భగవంతుని ఆశీస్సులేనన్నారు. భక్తులు స్నానం ఆచరించినా, లేకపోయినా నీరు తలపై చల్లుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి:

తిరుమలలో వైభవంగా పుష్పయాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.