అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలంలో లత అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. లత బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ఐదు గంటలకే తన భర్త నిద్రలేపి పొలం పనులకు వెళ్లినట్లు తెలిపారు. ఎంత సేపటికి ఆమె బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించి గదిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే మృతురాలి భర్తకు సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చి చూసేసరికి తన భార్య మంచంపై రక్తపుమడుగులో పడి ఉంది. చెయ్యి నరాలను కట్ చేసినట్టుగా ఉందని తెలిపాడు. అయితే చెవిలోనూ, ముక్కులోనూ రక్తం వస్తుండడంతో మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: