SC ON OMC CASE : ఓబులాపురం మైనింగ్ కార్యకలాపాలపై దాఖలైన పిటిషన్లను గ్రీన్ బెంచ్‌కు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. మైనింగ్ కొనసాగింపుపై సుప్రీంకోర్టు గ్రీన్ బెంచ్ విచారణ చేయనుంది. ఓఎంసీ తవ్వకాల్లో హద్దులు చెరిపిన అంశం పరిగణనలోకి తీసుకోవాలంది. భూగర్భ తవ్వకాలు ఎక్కడి వరకు వెళ్తాయో చెప్పలేమంటూ.. ఆస్ట్రేలియా భూగర్భ మైనింగ్ వ్యవహారాన్ని ప్రస్తావించింది. మైనింగ్ కొనసాగింపునకు ఏపీ అంగీకారం తెలిపితే సరిపోదని, కర్ణాటక అనుమతి అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరిహద్దు వివాదంతో సంబంధం లేదని ఓఎంసీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదించారు. ప్రస్తుతం ఏపీలోనే మైనింగ్ జరుగుతోందని.. కర్ణాటకలో అభ్యంతరాలేమీ లేవని అన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. కర్ణాటకలో మైనింగ్ మొత్తం పూర్తయిందా అని ప్రశ్నించింది.
ఇవీ చదవండి: