అప్పుల బాధతో రైతు ఆత్మహత్య - ananthapuram district crime
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లిలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక రైతు రామాంజనేయులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకులో లక్షన్నరతో పాటు బయట ఆరు లక్షల వరకు అప్పు ఉన్నట్లు బంధువులు తెలిపారు. అప్పులను ఎలా తీర్చాలని ఆలోచిస్తూ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.