అనంతపురం జిల్లా ఉరవకొండలో తూనికలు కొలతులు శాఖ అధికారులు బంగారు దుకాణాలపై దాడులు చేశారు. రెండు దుకాణాల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలపై అధికారిక ముద్రలు లేవని గుర్తించారు. సీజ్ చేసి యజమానులకు జరిమానా విధించారు. వినియోగదారులు మోసాలకు గురికాకుండా ఉండేందుకు నగల దుకాణాల్లో తూనికల కొలతల శాఖ దాడులు నిర్వహించినట్లు అధికారుల తెలిపారు. నిబంధనల ప్రకారం వినియోగదారులు కొనుగోలు చేసిన నగలకు సంబంధించి వ్యాపారులు ఇచ్చే బిల్లులో ఖచ్చితంగా బంగారం నాణ్యత, బరువు, ఆభరణాల్లో వాడిన స్టోన్ బరువు, ధర విడివిడిగా పేర్కొనాలని అధికారులు దుకాణాదారులను ఆదేశించారు.
ఇదీ చూడండి