అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది(students protest at ssbn aided college). ఎయిడెడ్ కళాశాలల విలీనం ఆపాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య సుమారు గంటపాటు తోపులాట జరిగింది. ఈ క్రమంలో చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు. దీంతో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీ చేశారు. ఈ క్రమంలో ఓ విద్యార్థిని తలకు గాయమైంది.
ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళన ఉద్ధృతం చేశారు. దీంతో పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేయాలని ప్రయత్నించారు. దీంతో.. విద్యార్థులంతా ఒక్కసారిగా పోలీసులను అడ్డుకున్నారు. చదువుకునే విద్యార్థులు పై మీ ప్రతాపం చూపుతారా? అంటూ పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలోనే పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి, ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండి..
MAHA PADAYATRA: 'శివయ్యా.. సీఎం మనసు మారాలి, అమరావతే ఏకైక రాజధాని కావాలి..'