ETV Bharat / state

Students Fights: రోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు.. ఎందుకంటే..! - అనంతపురంలో రెండు వేర్వేరు చోట్ల విద్యార్థుల ఘర్షణలు

Students fights: చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లెక్కి ఘర్షణలకు పాల్పడుతున్నారు. పరస్పరం దాడులు చేసుకుంటూ నానా హంగామా సృష్టిస్తున్నారు. అనంతపురం జిల్లాలో.. మంగళవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో విద్యార్థుల గొడవలకు దిగారు.

Students fights on roads in ananthapur district
అనంతపురంలో రెండు వేర్వేరు చోట్ల విద్యార్థుల ఘర్షణలు
author img

By

Published : Apr 27, 2022, 11:52 AM IST

అనంతపురంలో రెండు వేర్వేరు చోట్ల విద్యార్థుల ఘర్షణలు

Students fights: అనంతపురం జిల్లా ఉరవకొండలో.. మంగళవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయి. 10వ తరగతి విద్యార్థి నవీన్‌ను తోటి విద్యార్థులు తీవ్రంగా కొట్టారు. ఆ సమయంలో రోడ్డుపై ఉన్నవారు అడ్డుకోవడంతో గొడవ సద్దుమణిగింది. బాధిత విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. దాడి చేసిన వారిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇక ఇంటర్ బాలికల కళాశాలలో సరస్వతి పూజ నిర్వహిస్తుండగా.. బాలుర కాలేజీకి చెందిన కొందరు యువకులు గొడవ చేశారు. అమ్మాయిలు పూజలు చేస్తుంటే తమకు ఎందుకు సెలవు ప్రకటించారంటూ.. బయటివారితో కలిసి కళాశాల ప్రాంగణంలో ఆందోళన చేశారు. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ వారిని చెదరగొట్టారు. ఆ తర్వాత కొద్ది సేపటికే కాలేజీ గేటు మూసేసిన సిబ్బందిపైకి విద్యార్థులు దాడికి యత్నించారు. రాళ్లు విసిరే ప్రయత్నం చేశారు.

సమాచారం అందుకుని అక్కడికి వచ్చిన ఎస్‌ఐ.. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. గొడవకు దిగిన విద్యార్థులు, బయటి వ్యక్తులపై.. కళాశాల ప్రిన్సిపాల్ మమత పోలీసులకు పిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:

Viral Video: టోల్​ సిబ్బందికి చుక్కలు చూపించిన లారీ డ్రైవర్​..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.