అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని వెంకటరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో.. చెత్త పేరుకుపోయి పురుగులు చేరుతున్నాయి. ఈ పురుగులు విద్యార్థులకు కుట్టడంతో.. అస్వస్థతకు గురవుతున్నారు. పాఠశాలలో మొత్తం 116 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలకు సరైన వసతులు లేకపోవడంతో.. మూడుచోట్ల భవనాలు నిర్మించారు. పాఠశాలకు నీటి సౌకర్యం, గేటు కూడా లేదని ఉపాధ్యాయులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉపాధ్యాయుల వాగ్వాదం
పాఠశాలలో మొత్తం ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాల తరగతులు తీసుకోవాలని.. మిగిలిన నలుగురు ప్రాథమికోన్నత పాఠశాల తరగతులు నిర్వహిస్తారని విభజించుకోవడంతో వాగ్వాదం తలెత్తింది. ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదంతో విద్యార్థుల తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేశారు.