ETV Bharat / state

బడికి వెళ్లడానికి నిత్య సాహసం.. రైలు గండం దాటాల్సిందే! - అనంతపురంలో బడికి వెళ్లేందుకు సాహసం చేస్తున్న విద్యార్థులు

ఆ ఊరి విద్యార్థులు బడికి వెళ్లేందుకు.. రోజూ పెద్ద సాహసమే చేయాలి. పుస్తకాల మోతతో.. ప్రమాదపుదారుల్లో ప్రయాణించాలి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వంతెన దాటాలి. అనంతపురం జిల్లా అల్లుగుండు వాసుల దారి కష్టాలపై.. "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం.

students face problems while going to school in ananthapur
బడికి వెళ్లేందుకు సాహసం చేస్తున్న అల్లుగుండు విద్యార్థులు
author img

By

Published : Dec 26, 2021, 6:12 PM IST

పుస్తకాల మోతతో రైలు పట్టాలు దాటుతున్న విద్యార్థులు

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం అల్లుగుండుకు చెందిన విద్యార్థులంతా.. పాఠశాలకు వెళ్లాలంటే వంతెనపై నడిచి వెళ్లాల్సింది. బడికి వెళ్లేందుకు వీరు ప్రతిరోజూ పెద్ద సాహసమే చేయాల్సి వస్తోంది. జాతీయ రహదారి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లచెరువుకు వెళ్లేందుకు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ బ్రిడ్జ్‌లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరింది. ఫలితంగా ఈ మార్గం నుంచి నడిచి వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

అల్లుగుండు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం ఇదే. ప్రతిరోజూ ఈ ఊరి నుంచి పాఠశాలకు 150 మంది విద్యార్థులు వెళ్తున్నారు. వీరంతా వేరే మార్గంలేక వంతెన పిట్టగోడలపై నుంచి ట్రాక్ మీదగా ప్రమాదకర పరిస్థితుల్లో దాటుతున్నారు. విద్యార్థుల బాధలను చూసిన స్థానికులు.. పక్కనే ఉన్న పొలం యజమానికి విజ్ఞప్తి చేసి కాలినడకకు సరిపడే మార్గాన్ని తీసుకున్నారు. ఆ పొలం నుంచి వెళ్లాలన్నా విధిగా రైలు పట్టాలు దాటాల్సిందే. గతంలో ఉన్న లెవల్ క్రాసింగ్ ను తొలగించి అండర్ బ్రిడ్జ్‌ నిర్మించారు. కానీ.. వర్షపు నీరు చేరి అది ఉపయోగపడడం లేదు. ఏ సమయంలో ఎటు నుంచి రైళ్లు వస్తాయో తెలియక విద్యార్థులు భయం భయంగా పట్టాలను దాటుతున్నారు.

గ్రామంలో ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారిని తరలించేందుకు అంబులెన్స్‌ వచ్చే మార్గం లేదని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ద్విచక్రవాహనాలే దిక్కని వాపోతున్నారు. అల్లుగుండు వాసుల ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయంటున్న అధికారులు.. రైల్వే అండర్ బ్రిడ్జ్‌ కింద ఉన్న నీటిని తొలగిస్తామని చెబుతున్నారు.

ఇదీ చదవండి:

AMC PRINCIPAL DR SUDHAKAR: 'కరోనా టీకాలు తీసుకోండి.. జాగ్రత్తగా ఉండండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.