పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా గుత్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు గులాబి పూలతో వినూత్న నిరసన చేపట్టారు. కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పెట్టడం చాలా విడ్డూరమని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. వెంటనే పరీక్షలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కు గులాబీ పువ్వులు ఇచ్చి.. పరీక్షలు రద్దు చేయాలని వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చదవండి: షెడ్యూల్ ప్రకారమే ఇంటర్ పరీక్షలు: మంత్రి సురేశ్