ETV Bharat / state

పంతం నెగ్గించుకున్న ఎస్‌కేయూ వీసీ - విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్లిన పోలీసులు - AP Latest News

Student Unions Opposed the YSR statue Installation in SK University: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని విద్యార్థి సంఘాల నేతలు వ్యతిరేకించి.. ఆందోళనకు దిగిన ఘటన అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీంతో విద్యార్థి సంఘాల నేతలను రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీసు వాహనంలో కుక్కి స్టేషన్​కు తరలించారు.

ysr_statue_installation
ysr_statue_installation
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 4:36 PM IST

Student Unions Opposed the YSR statue Installation in SK University: అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆందోళనలు, ఉధ్రిక్తతల మధ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ (YS Rajasekhar Reddy statue Inauguration) చేశారు. ఎస్కేయూ ఆవరణలో వైఎస్ విగ్రహాన్నిఏర్పాటు చేయటాన్ని విద్యార్థి సంఘాలు చాలా నెలలుగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో విగ్రహం ఏర్పాటు చేసే దిమ్మె నిర్మాణం చేయించిన పెట్టిన ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి ఇవాళ పట్టుదలతో ఆవిష్కరణ చేయించారు. మరో రెండు రోజుల్లో పదవీ కాలం పూర్తికానున్న వీసీ రామకృష్ణారెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని, ఎంపీ గోరంట్ల మాధవ్ ను అతిథులుగా ఆహ్వానించి విద్యార్థి సంఘాల వ్యతిరేక ఉద్యామాలు, అరెస్టుల మధ్య వీసీ పంతం నెగ్గించుకున్నారు.

పంతం నెగ్గించుకున్న ఎస్‌కేయూ వీసీ - విద్యార్థులను ఈడ్చుకుంటూ వెళ్లిన పోలీసులు

YSR Statue: యూనివర్శిటీలో వైయస్ విగ్రహమా? వీసీని రీకాల్ చేయాలి.. విద్యార్థి సంఘాల డిమాండ్!

ఏబీవీపీ, టీఎన్ఎస్ఎఫ్ తో పాటు ఇతర విద్యార్థి సంఘాలు చాలా కాలంగా సావిత్రిబాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే పూలే విగ్రహం ఉన్నందున రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామని రెండు రోజుల్లో పదవి కాలం పూర్తయ్యే వీసీ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గోబ్యాక్ అంటూ విద్యార్థి సంఘాల నేతలు తీవ్రంగా ప్రతిఘటిస్తూ, ఆవిష్కరణకు అడ్డుపడటంతో పోలీసులు నేతలను ఈడ్చి పడేశారు.

Water Plant demolished: వైసీపీ ఆగడాలు.. వైఎస్సార్​ విగ్రహం కోసం వాటర్​ ప్లాంట్​ కూల్చివేత

రోడ్డుపై విద్యార్థి సంఘాల నేతలను ఈడ్చుకుంటూ పోలీసు వాహనంలో కుక్కి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. మూడు రోజుల క్రితం సిమెంట్ దిమ్మెపై విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన వీసీ, రాత్రింబవళ్లు పోలీసులను కాపలా పెట్టి, భారీ పోలీసు బందోబస్తు మధ్య విగ్రహావిష్కరణ చేశారు. దాతల నుంచి సేకరించిన నిధులతో రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేశామని, దాతల జాబితా తమ వద్ద ఉందని వీసీ రామకృష్ణా రెడ్డి చెప్పారు. మహా నాయకుడు కాబట్టే ఎస్కేయూలో విగ్రహం ఏర్పాటు చేసినట్లు ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు.

'వీసీ పదవీకాలం పొడిగించుకునేందుకు వర్సిటీలో వైఎస్ విగ్రహం' - ఏఐఎస్​ఎఫ్​ నిరసన

నాకు పదవీ కాలం పెంచుకునే ఆలోచన, మళ్లీ చేరే కాని లేదు నేను ఇక్కడకు వచ్చిన రోజే చెప్పా.. నా పదవీ కాలం నవంబర్ 2023కి అయిపోతుంది. కాబట్టి ఈరోజు నేను ఏ విధంగా ఆదేశాలు ఇచ్చానో.. నేను వెళ్లిపోయే రోజు కూడా అదే విధంగా ఆదేశాలు ఇస్తానని అదే పాటిస్తానని చెప్పా.. సాధారణంగా అందరు వీసీలు ఏం చేస్తారంటే అందరి మెప్పు పొందడానికి వారికి అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇప్పడు కూడా తప్పు చేస్తే ఎవరినీ క్షమించేది లేదు.. నాకు ఎవ్వరి మెప్పు అవసరం లేదు కూడా ఈ విగ్రహం పెట్టడానికి కారణం వైఎస్సార్​ గారు ఎంతోమంది విద్యార్థులకు మంచి చేశారు ఆ కారణం వల్లనే ఈ విగ్రహం పెట్టాం.- రామకృష్ణారెడ్డి, వీసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.