ETV Bharat / state

సరదా కోసం ఈతకు వెళ్లి.. విగతజీవిగా తిరిగొచ్చాడు! - gutthi

సెలవు రోజు కావటం వల్ల ఓ విద్యార్థి స్నేహితులతో సరదాగా గడపాలనుకున్నాడు. కళాశాల సమీపంలో ఉన్న రిజర్వాయర్​ వద్దకు ఈతకు వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉన్నందువల్ల ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. ఈ ఘటన గుత్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

గుత్తి మండలం సేవాఘట్​ వద్ద విషాదం.. విద్యార్థి మృతి
author img

By

Published : Sep 23, 2019, 9:52 PM IST

గుత్తి మండలం సేవాఘట్​ వద్ద విషాదం.. విద్యార్థి మృతి

అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని సేవాఘట్​ వద్ద విషాదం చోటుచేసుకుంది. పామిడి దిగువ తండా గ్రామానికి చెందిన మోహన్ నాయక్... స్థానిక గిరిజన కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావటం వల్ల స్నేహితులతో సరదాగా గడపాలనుకున్నాడు. కళాశాల సమీపంలో ఉన్న రిజర్వాయర్ వద్దకు ఈతకు వెళ్లాడు. లోతు ఎక్కువగా ఉండటం వల్ల ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు విలపిస్తున్న ఘటన అందరినీ కలిచివేసింది. మోహన్​ మృతికి కళాశాల యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాలు ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టాయి. అధికారులు విద్యార్థి కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి:

వాగులో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

Intro:Ap_Vsp_93_07_Ysrcp_Leader_Join_In_Tdp_Abb_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ జిల్లాలో వైకాపాకు గట్టి షాక్ తగిలింది. ఇటీవలే ఆపార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి తెదేపాలో చేరగా నిన్న మాజీ ఎమ్మెల్యే లో విశాఖ లోక్ సభ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు తైనాల విజయ్ కుమార్ కూడా పసుపు కండువా కప్పుకున్నారు.

Body:ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు సమక్షంలో ఇవాళ వైకాపా దక్షిణ నియోజకవర్గ సమన్వయ కర్త కళా హాస్పిటల్స్ ఎండి పైడి వెంకటరమణమూర్తి ఇవాళ తెదేపాలో చేరారు. అలాగే ఆయన వెంట సుమారు 500 మంది కార్యకర్తలు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

Conclusion:రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తెదేపాలోకి వస్తున్నారని తాజాగా వైకాపాకు చెందిన కీలక నేతలు తెదేపాలో చేరడం చాలా ఆనందంగా ఉందని గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్, నగర అధ్యక్షుడు రహమాన్ తదితరులు పాల్గొన్నారు

బైట్: గంటా శ్రీనివాసరావు, మంత్రి.
: పైడి వెంకటరమణమూర్తి, వైకాపా నేత, కళా హాస్పిటల్స్ ఎండి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.