ETV Bharat / state

కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డిని నిలదీసిన స్థానికులు - కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డికి ఊహించని షాక్

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం వేపలకుంట సమీపంలోని గండిచెరువులో జల హారతి నిర్వహించేందుకు వెెళ్లిన కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డిని స్థానికులు అడ్డుకున్నారు. గండి చెరువు బ్యాక్ వాటర్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించిన తర్వాతే జలహారతి నిర్వహించాలని నిలదీశారు.

కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి
కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి
author img

By

Published : Nov 7, 2021, 9:46 AM IST

వైకాపా నాయకులు, ప్రభుత్వ అధికారులతో కలిసి జలహారతి నిర్వహించేందుకు వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఊహించని షాక్ ఎదురయ్యింది. అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం వేపలకుంట సమీపంలోని గండిచెరువులో జల హారతి నిర్వహించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డిని ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు గండి చెరువు బ్యాక్ వాటర్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లారు.

గండి చెరువు కట్ట ఎత్తు పెంచడం వల్ల ఎగువ ప్రాంతంలోని వేపల కుంట గ్రామంలోకి నీరు చేరుతోంది. ఫలితంగా నివాసాలు దెబ్బతినడంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. సమస్యను శాసన సభ్యుడికి వివరించేందుకు వెళ్తున్న వేపలకుంట గ్రామస్తులను అధికార పార్టీ స్థానిక నాయకులు అడ్డుకునేందుకు యత్నించారు.

పరిస్థితిని గమనించిన మహిళలు.. ఎమ్మెల్యే వస్తున్న మార్గానికి వెళ్లి అడ్డుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించిన తర్వాతే జలహారతి నిర్వహించాలంటూ నిలదీశారు. మహిళలు తమ ఇబ్బందులను, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో ఎమ్మెల్యే అసహనానికి గురయ్యారు. ఏమికావాలో అందరూ కలిసి రాసి ఇవ్వండంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

ఇదీ చదవండి: డిసెంబరు వరకు రుణ పరిమితి.. రూ.2,155 కోట్లే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.