ETV Bharat / state

కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాదే శంకుస్థాపన

ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రానికి ఏడాదే శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చే అవకాశం ఉంది.

kovvada nuclear power plant
కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రంకు ఈ ఏడాదే శంకుస్థాపన
author img

By

Published : Mar 18, 2020, 8:11 AM IST

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ వద్ద అణు విద్యుత్ కేంద్రం పనులకు ఈ ఏడాది శంకుస్థాపన చేయనున్నట్లు విద్యుత్ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మన దేశ పర్యటనకు వచ్చినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చింది. ఈ చర్చల తర్వాత ప్లాంటు నిర్మాణానికి త్వరలో చర్యలు ప్రారంభించటానికి ఉభయదేశాలకు చెందిన ప్రతినిధులు మరోసారి అంగీకరించారని విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. శంకుస్థాపనకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని వివరించారు.

భూసేకరణ పూర్తి:

ప్రాజెక్టు ఏర్పాటుకు 2 వేల 700 ఎకరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 6 అణు రియాక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్కటి 1,024 మోగావాట్ల విద్యుదుత్పుత్తి సామర్థ్యం ఉంటుంది. మెగావాట్​కు 10 కోట్ల రూపాయల చొప్పున 61 వేల కోట్ల రూపాయల అంచనాలతో ప్రతిపాదనలను రూపొందించారు. శంకుస్థాపన చేశాక అయిదేళ్లలో నిర్మిస్తారని అధికారి తెలిపారు.

ఇదీ చదవండి: 'సమీరా' రాకెట్.. గ్రాండ్​స్లామ్​పై గురిపెట్టెన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.