అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లలో ధర్మవరం రోడ్డు పక్కన ఎస్ఆర్పీ పైప్ లైన్‌కు గండి పడటంతో మరమ్మతులు చేసేందుకు పైపుని తెరచారు. ఈ గండి నుంచి 50 అడుగుల ఎత్తుకు వరకు నీరు ఎగిసి పడుతోంది. ఇది చూడడానికి ఫౌంటెయిన్‌లా కనువిందు చేసింది. పీఏబీఆర్ నుంచి హిందూపురం ప్రాంతానికి మంచినీటిని సరఫరా చేసే ఈ పైప్ లైన్‌కు గండి పడటంతో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయి. సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు నీటి సరఫరా ఆపేసి మరమ్మతు పనులు ప్రారంభించారు.
ఇదీ చదవండి: అమరావతిలో గుండెపోటుతో ఇద్దరు మృతి