అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గానికి సరిహద్దున ఉన్న కర్ణాటకలోని.. కెరేక్యాతనహళ్లి గ్రామంలో శ్రీస్వారమ్మదేవి, శ్రీ శంకరలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఎనిమిది రోజులపాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజు బాయిబీగ(నోటికి తాళం), సిరడిమాను కార్యక్రమాలు ప్రత్యేకతను చాటుకున్నాయి. భక్తులందరూ తమ కోరికలు నెరవేరాలని ఉపవాసంతో స్నానమాచరించి.. ఆలయానికి దూరంలో ఉన్న కొండపై పూజలు నిర్వహించారు.
ఇనుప చువ్వలతో నోటికి తాళం వేయించుకొని.. అక్కడి నుంచి స్వారమ్మ దేవాలయం వరకు మేళ తాళాలతో ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం ఇనుప చువ్వతో నోటికి వేసిన తాళం తీయించుకున్నారు. మరికొంతమంది భక్తులు తాడు కట్టిన ఇనుప కొక్కీలను వీపుకు గుచ్చుకొని ఆ తాడును సిరడిమానుకు కట్టి మానుపై మూడుసార్లు గాల్లో గిరగిరా తిరిగిగారు. ఈ జాతరలో ఆంధ్ర, కర్ణాటక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గతంలో మేము కోరిన... కోర్కెలు నెరవేరాయని.. కొత్తగా కోరుకున్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయనే ప్రగాఢ విశ్వాసంతో మొక్కులు చెల్లిస్తున్నామని భక్తులు తెలిపారు.
ఇదీ చదవండి: "రూ.70కోట్లతో అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాం"