అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో శ్రీరాంరెడ్డి నీటి పథకం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గత 3 నెలల నుంచి తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వేతనాల నిలుపుదలతో కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నామని వాపోయారు. 3 నెలల జీతంతోపాటు 52 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని కోరారు.
వందలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్న తమపై రాజకీయ జోక్యం ఎక్కువైందని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించి తమకు వేతనాలు పెంచేలా జోక్యం చేసుకోవాలని విన్నవించారు. అధికార పార్టీ నేతల వేధింపులు ఆపాలను కోరారు.
ఇవీ చదవండి...