అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల స్నాతకోత్సవం సందర్భంగా ఉపకులపతి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొత్త వంగడాలను రూపొందించడంలో యూనివర్సిటీ ఎప్పుడు ముందుంటుందన్నారు. ఇప్పటికే 449 రకాల వంగడాలు విడుదల చేసిందని, గత రెండు నెలల క్రితం 18 రకాల కొత్త వంగడాలను విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పండించే బిపిటి-04 అనే రకానికి సమానమైన రకం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రాలేదని స్పష్టం చేశారు.
ఇండియన్ కల్చర్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రతి ఐదు, పది సంవత్సరాలకు ఒకసారి అగ్రికల్చర్ సిలబస్ ప్రమాణాలను మార్పులు చేస్తుందని.. దీని ప్రకారమే దేశవ్యాప్తంగా ఉన్న 74 వ్యవసాయ యూనివర్సిటీలు నిబంధనలు పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అన్ని వ్యవసాయ శాఖ యూనివర్సిటీలోనూ శాస్త్రవేత్తల కొరత ఉందని వీలైనంత త్వరగా నియామకాలు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో మంచి ప్రతిభ ఉన్న విద్యార్థులు ఈ కళాశాల నుంచి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి...