ETV Bharat / state

చిత్రావతి ముంపు బాధితులను పట్టించుకోని అధికారులు..

author img

By

Published : Jul 27, 2021, 10:00 PM IST

Updated : Jul 28, 2021, 6:26 AM IST

అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్వాసితుల గోడు వినే అధికారులు, నేతలు కరువయ్యారు. ఇంట్లో మనుషులండగానే యుద్ధప్రాతిపదికన వారిని బయటకు లాక్కొచ్చిన అధికారులు.. పరిహారం చెల్లించటంలో మీనమేషాలు లెక్కపెడుతున్నారు. బాధితులకు పరిహారం ఇచ్చేసిన ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణానికి.. కనీస సాయం చేయట్లేదని నిర్వాసితులు వాపోతున్నారు. సొంత ఇల్లు పోగొట్టుకుని.. అప్పులు చేసి కడుపునింపుకుంటున్నారు.

సీబీఆర్ డ్యాం
cbr dam
'గోడు వినేదెవరు?'

అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ముంపు బాధితులు.. పరిహారం కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నా... అధికారులు కరుణించట్లేదు. 10 టీఎంసీల గరిష్ఠ నీటి నిల్వ ఉంచాలన్న ప్రభుత్వ ఆదేశాలతో.. తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లి గ్రామాన్ని.. గతంలో రెవెన్యూ అధికారులు అప్పటికప్పుడు ఖాళీ చేయించారు. మొత్తం 809 మంది నిర్వాసితులు ఉండగా.. 409 మందికి ప్రభుత్వం పరిహారం చెల్లించింది. మిగిలినవారికి.. పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. కనీసం ఇళ్లలో సామానులు తీసుకునే అవకాశమూ లేకుండా నీళ్లు వదిలేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచీ ఇప్పటివరకూ నిరుపేదలు.. పరిహారం కోసం పడరానిపాట్లు పడుతున్నారు. ప్రభుత్వం నిండా ముంచిందని ఎస్సీలు ఆవేదన వ్యక్తం చేశారు.

రాఘవంపల్లి గ్రామమూ ముంపునకు గురైంది. అందులో 33 మందికి పరిహారం అందించాల్సి ఉండగా.. దాని కోసం బాధితులు ముప్పుతిప్పలు పడుతున్నారు. అందరితో సమానంగా పది లక్షల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఏడు లక్షలే ఇస్తామని చెబుతున్నారని వెల్లడించారు. కనీసం అవి ఇచ్చేందుకూ అధికారులు చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి.. ఆర్​డీటీ సంస్థ కట్టించిన ఇళ్లనూ ప్రభుత్వమే కట్టించినట్లుగా ప్రచారం చేసుకుంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

మర్రిమాకులపల్లి గ్రామం.. ముంపులో పోయిందని గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం... బాధితులందరికీ పరిహారం చెల్లించినట్లుగా నమోదుచేసుకుని గ్రామపంచాయతీని రద్దు చేసింది. దీంతో.. వీళ్లు ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాలకు ధ్రువీకరణ పత్రాలు పొందలేకపోతున్నారు. ఉన్న ఇల్లు పోగొట్టుకుని.. రాని ఇల్లు కోసం ఎదురుచూస్తూ ఏళ్లు గడుస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండీ.. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజ్ తొలగింపు

Last Updated : Jul 28, 2021, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.