అనంతపురం జిల్లా హిందూపురంలో అక్రమ మద్యం రవాణా, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏఎస్పీ రామ్మోహన్రావు సమావేశం నిర్వహించారు. జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఇప్పటివరకు 958 అక్రమ మద్యం రవాణా కేసులు నమోదుచేసి.. 1198 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారి నుంచి 250 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా.. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిపై ఇప్పటివరకు 80 కేసులు నమోదుచేసి 800 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 95 చెక్‌పోస్ట్‌లు, 15 ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అక్రమ ఇసుక మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయడం కోసం 540 మంది సిబ్బంది పని చేస్తున్నారని చెప్పారు.
ఇదీచదవండి.