అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే హాస్పిటల్ వద్ద రూ. 86 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 1000 లీటర్ల సామర్థ్యమున్న ఆక్సిజన్ ప్లాంట్ ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా(Gajanan Mallya) ప్రారంభించారు. కరోనా మూడవ దశ వచ్చే ప్రమాదం ఉందనే సంకేతాలతో ముందస్తు జాగ్రత్తగా ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. హాస్పిటల్ వైద్యసదుపాయాలు అందించడానికి, మరింత మందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని అన్నారు. 90శాతం కొవిడ్ సోకిన రోగులు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే నయమైనట్లు తెలిపారు. ఇప్పటివరకు సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్లు, తిరుపతి, ఖాజీపేట్ లలో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
పర్యటన ఎలా జరిగిందంటే..
చిత్తాపూర్-రాయచూర్ సెక్షన్‌లో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య మంగళవారం తనిఖీలు చేపట్టారు. స్టేషన్ వద్ద పరిసరాలను, సర్క్యులేటింగ్ ఏరియాను పరిశీలించి, స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న వసతులను జీఎం సమీక్షించారు. యాదగిరి రైల్వే స్టేషన్ నుంచి జీఎం గజానన్ మాల్య తనిఖీలు ప్రారంభించారు. స్టేషన్ వద్ద పరిసరాలను, సర్క్యులేటింగ్ ఏరియాను పరిశీలించి, స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న వసతులను ఆయన సమీక్షించారు. అధికారులతో వివిధ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. గూడ్స్ షెడ్‌ను తనిఖీ చేయడంతో పాటు, సరుకు రవాణా వినియోగదారులతో సమావేశమై..సరుకు రవాణాలో మరింత అభివృద్ధి, రవాణా సులభతరంపై చర్చించారు. ప్రతిపాదిత 2వ గూడ్స్ లైన్‌ను తనిఖీ చేసి, సరుకు రవాణా లోడిరగ్, అన్‌లోడిరగ్‌లో అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.
యాదగిర్-రాయచూర్ సెక్షన్ మధ్య లింగేరి స్టేషన్‌లో.. స్టేషన్ మేనేజర్ కార్యాలయాన్ని, స్టేషన్ పరిసరాలను తనిఖీ చేశారు. ప్రతిపాదిత ప్రత్యామ్నాయ గూడ్స్ షెడ్‌ను పరిశీలించారు. భద్రతా అంశంలో భాగంగా ట్రైన్ తనిఖీ పాయింట్‌ను జీఎం గజానన్ మాల్య తనిఖీ చేశారు. రాయచూర్ స్టేషన్‌లో తనిఖీలతో పాటు.. ప్లాట్‌ఫారాలు, పాదచారుల వంతెన పరిశీలించి, అక్కడ సిబ్బందితో వారి సంక్షేమంపై మాట్లాడారు. గూడ్స్ షెడ్‌ను తనిఖీ చేశారు. గూడ్స్ లోడింగ్ మెరుగుదలకు సంబంధించి వ్యాపారస్తులతో, వినియోగదారులతో సరుకు రావాణా అభివృద్ధికి సంబంధించి వారితో మాట్లాడారు.
ఇదీ చదవండి:
Gajanan Mallya: చిత్తాపూర్-రాయచూర్ సెక్షన్‌లో గజానన్ మాల్య తనిఖీలు