అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో ఓ వ్యక్తి నిస్సత్తువగా.. కంకరాళ్లపై పడి ఉన్నాడు. తనది కర్ణాటకలోని హాసన్ జిల్లా బెట్టదపుర సమీపంలోని ఓ గ్రామం అని చెబుతున్నాడు.
నా కుమారుడు బెంగళూరులో పని చేస్తున్నాడు. ఆరు రోజుల కిందట కారులో తీసుకొచ్చి ఈ ఊరి సమీపంలో వదిలి వెళ్లిపోయాడు. దారిన వెళుతున్న ఓ వ్యక్తిని బతిమాలితే ఈ ఆసుపత్రి బయట దింపారు. ఎండ ఎక్కువగా ఉండటంతో.. నీడకు చేర్చమని కోరాను. కానీ ఎవరు సాయం చేయలేదు. అదిగో అప్పుడు ఆ ఆసుపత్రిలో పని చేసేటోళ్ల వచ్చి.. ఇక్కడ వదిలి వెళ్లారు. ఇక్కడికొచ్చేటోళ్లు ఏదైన పెడితే తింటున్నాను.
- బాధితుడు
ఈ విషయాన్ని వైద్యాధికారి సునీల్ దృష్టికి తీసుకెళ్లగా.. వృద్ధున్ని పరీక్షించి ఆరోగ్య సమస్యలేదని, అవసరమైతే చికిత్స అందిస్తామని చెప్పారు.
ఇదీ చదవండీ.. చేతబడి నెపంతో హత్యచేసి.. ఇసుకలో పూడ్చివేసి