ETV Bharat / state

కలెక్టర్ చొరవతో నీటి సమస్యకు పరిష్కారం

author img

By

Published : Jun 10, 2020, 10:16 PM IST

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చొరవతో... ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామంలో నీటి సమస్య తీరింది. వాటర్​ పైప్​లైన్​ మరమ్మతుకు గురి కావడం వల్ల గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ క్రమంలో పైప్​లైన్​ బాగు చేయాలన్న కలెక్టర్​ ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది.

Solution to water problem with collector initiative
కలెక్టర్ చొరవతో నీటి సమస్యకు పరిష్కారం

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు చొరవతో ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామం నీటి సమస్య పరిష్కారమైంది. పీఏబీఆర్ డ్యాం నుంచి ఉరవకొండకు వచ్చే 400 డయామీటర్ సామర్థ్యంతో ఉన్న హెచ్​డీపీఈ వాటర్​ పైప్​లైన్​ మోపిడి గ్రామం వద్ద కొద్దిరోజుల కిందట పగిలిపోయింది. పీఏబీఆర్ నుంచి నీటి సరఫరా నిలిచిపోవటంతో పలు గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. దీని ప్రభావం ఆమిద్యాల గ్రామంపై పడటంతో... నీటి సమస్య తీవ్రమైంది.

నీటి సమస్యపై ఆమిద్యాల గ్రామస్థులు జిల్లా కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్​ వెంటనే పైప్​లైన్​ బాగు చేయాలని ఆర్​డబ్ల్యూ ఎస్​ఈ హరేరామ్​ నాయక్​కు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్​ ఆదేశాలతో అధికారులు పైప్​లైన్​కు మరమ్మతు చేశారు. ఈ క్రమంలో ఆమిద్యాల గ్రామం నీటి సమస్య పరిష్కారమైంది.

ఇవీ చదవండి:

ఆ మార్కెట్ మళ్లీ మెుదలైంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.