అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన ఓ యువకునికి కరోనా లక్షణాలు ఉన్నట్లు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. ఆ యువకుడు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.15 రోజుల క్రితం మరొక వ్యక్తితో కలిసి రాయదుర్గం వచ్చాడు. మూడు రోజుల నుంచి జలుబు, దగ్గు, ఛాతి సంబంధమైన నొప్పులు రావడం వల్ల ఆదివారం ఉదయం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లాడు. ప్రభుత్వ వైద్యాధికారి మహేష్ అతనికి వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కుటుంబంలోని నలుగురికి పరీక్షలు చేశారు. వారందరిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిని సందర్శించి... కరోనా లక్షణాలు గురించి వైద్యాధికారి మహేష్‌ని అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి :