అనంతపురం జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని సప్తగిరి కాలనీలో 34వ నెంబర్ చౌక దుకాణంలో నిర్వాహకుడు రామాంజనేయులు ప్రజలకు నిత్యావసరాల అందించే సమయంలో దూరం పాటించడానికి కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. ఎనిమిది అడుగుల పొడవున్న ఓ పైపు ద్వారా లబ్ధిదారులకు బియ్యం సరఫరా చేస్తున్నాడు. నిత్యావసర దుకాణాల నిర్వాహకులు ఇలాంటి పద్ధతిని అవలంబిస్తే కరోనా వ్యాప్తి నివారించవచ్చని ప్రజలు అంటున్నారు. సర్వర్ సమస్య కారణంగా గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 30 మంది లబ్ధిదారులకే నిత్యావసరాలు అందజేశారు.
ఇది చదవండి సంతలో భౌతిక దూరం పాటించని ప్రజలు