స్నేహలతపై అనుమానంతోనే ఆమె ప్రియుడు రాజేష్ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద జరిగిన హత్య కేసులో నిందితులైన రాజేష్, నరేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మవరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఇతర నిందితులను ప్రత్యేక పోలీసు వాహనంలో పెనుకొండ సబ్ జైలుకు తరలించారు.
సంవత్సర కాలంగా స్నేహలతతో ప్రేమ వ్యవహారం నడిపిన రాజేష్... ఇటీవల ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉందనే అనుమానం పెంచుకున్నాడన్నారు. ఈ క్రమంలోనే మాట్లాడాలని పొలాల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడని తెలిపారు. పోలీసులు సకాలంలో స్పందించ లేదన్న స్నేహలత తల్లి ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చూడండి...