Singanamala MLA jonnalagadda padmavathi : వైఎస్సార్సీపీ (Ysrcp) లో ఒక కులానికే అన్నీ దక్కుతున్నాయని, ఒక నియోజకవర్గానికే ముఖ్యమంత్రి మేలు చేస్తున్నారంటూ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ ఇవ్వడం లేదని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లలోనూ తన నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆమె వాపోయారు. తాగు, సాగునీటి కోసం యుద్ధాలు చేయాల్సి వస్తోందని, పెద్దిరెడ్డి చెప్పినట్లుగా జగన్ నడుచుకుంటున్నారని అన్నారు. తాగునీటి కోసం పోరాడదాం.. అందరూ కలిసిరండి అని నియోజకవర్గ ప్రజలకు పద్మావతి పిలుపునిచ్చారు.
వైసీపీకి సిద్దాంతాలు ఉండాలి- షర్మిలమ్మతోనే నా రాజకీయ జీవితం ముడిపడి ఉంది: ఆర్కే
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇన్చార్జ్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పను మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టు నడుచుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సుదీర్ఘంగా మాట్లాడిన ఎమ్మెల్యే పద్మావతి ఐదేళ్లలో తన అనుభవాలను పంచుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించట్లేదంటూ ముఖ్యమంత్రి చెప్పారని వెల్లడించారు. ఇన్నాళ్లూ నియోజకవర్గ అభివృద్ధికి కేటాయింపులకు కూడా ఈ ముఖ్యమంత్రి ఏమాత్రం సహకరించలేదని, తన పట్ల, తన భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) వివక్ష చూపారని తెలిపారు. ఎన్నికల్లో టికెట్ కేటాయించాలంటూ ముఖ్యమంత్రిని అభ్యర్థించినా అటువైపు నుంచి ఏ మాత్రం స్పందన లేదని వాపోయారు. ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఏమీ చేయలేకపోయాను అంటూ శింగనమల నియోజకవర్గ ప్రజలకు ఫేస్బుక్ లైవ్ లో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.
- https://fb.watch/prpvy7Qk9s/
తాడేపల్లి కేంద్రంగా వైసీపీలో తుపాను - 'టికెట్ రాకున్నా హ్యాపీ - ఓడిపోవడం కంటే అదే బెటర్'
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పద్మావతి ఫేస్బుక్ లైవ్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. శింగనమల (Shinganamala) చెరువుకు నీరు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాల్సి వస్తోందని, నీటి కోసం ఎన్నిసార్లు అడిగినా స్పందించిన దాఖలాలు లేవు అని వాపోయారు. అధికార పక్షంలో ఉండి కూడా నీటిపారుదల శాఖ అధికారులను కోరినా ఎవరూ పట్టించుకోలేదని నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. సీఎం ఆఫీసుకు వెళ్తే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి లేదని చెప్తూ నీళ్లు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాలా? అని ప్రశ్నించారు. వరదలొస్తేనే నీళ్లు ఇస్తారా? ఎస్సీ నియోజకవర్గం అంటే అంత చిన్న చూపా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక కులం, ఒక నియోజకవర్గానికే అన్నీ సమకూరుస్తారా? నీటి కోసం ఎన్నేళ్లు ఇలా పోరాటం చేయాలి? అని అధికార పార్టీ పెద్దలను సూటిగా ప్రశ్నించారు. నీళ్ల కోసం ప్రశ్నిస్తే పెద్ద నేరంగా భావిస్తారా? ఐదేళ్లలో ఒకసారి కంటితుడుపుగా నీళ్లు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నిస్తూ నీటి కోసం పోరాడదాం.. అందరూ కలిసిరండి అని ఎమ్మెల్యే పద్మావతి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.