shivaratri celebrations: అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా సాగాయి. వీరభద్రుని వేషధారణలో ఉన్న కళాకారులకు రఘువీర దంపతులు పాదాభిషేకం చేశారు. ఆలయంలోని శివలింగం వద్ద నృత్యం ఆచరిస్తూ దేవుళ్ల మహిమలను కన్నడ భాషలో వీరభద్రులు చాటారు.
"బెంగళూరు ప్రాంతానికి చెందిన మేము రఘువీరారెడ్డి ఆహ్వానం మేరకు వీరభద్రుని వేషధారణలో ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నాం. మేము చేసిన విన్యాసాల్లో సాంకేతిక దాగి ఉన్నా.. వాటిని దైవభక్తిలో లీనమైతేనే సంపూర్ణంగా చేయగలం" -కళాకారులు
shivaratri celebrations: పైకి విసిరిన నిమ్మకాయలు, టెంకాయలను కత్తితో రెండు ముక్కలు చేశారు. మండుతున్న కర్పూరాన్ని నాలుకపై ఉంచుకొని నాట్యం చేశారు. బియ్యపు గింజలతో నిండిన చెంబులో కత్తిని దూర్చి దాన్ని అమాంతంగా పైకి లేపి ఒక్క బియ్యపుగింజ కిందకు పడకుండా చెంబును గాలిలో తిప్పారు. నీటితో నిండిన చెంబుపై తెల్ల వస్త్రం కప్పి ఒక్క చుక్క నీరు ఒలకకుండా వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేశారు.
ఇదీ చదవండి: ఆ జాతరలో వేషం వేయాల్సిందే... జోలె పట్టాల్సిందే... అట్లైతేనే మెుక్కు చెల్లుతుంది