అనంతపురం జిల్లా పామిడిలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాడ మాస సందర్బంగా శాకంబరి అలంకరణ చేశారు. నవగ్రహాలకు, వినాయక, శివ పార్వతులను కూడా కూరగాయలు ఆకు కూరలతో అలంకరించారు. అమ్మవారికి అభిషేకాలతో .. ప్రత్యేక పూజలు చేశారు. లలిత సహస్రనామ పారాయణం , ప్రాకారోత్సవం నిర్వహించి లాలీ పాటలు పాడుతూ డోలోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు.
ఇది కూడా చదవండి.