Temperature Drops in Telangana: తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రిపూట పలు ప్రాంతాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రత నమోదవుతోంది. మంగళవారం రాత్రి అత్యల్పంగా కుమురం భీం జిల్లా సిర్పూరులో 8.9, హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో 12.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తూర్పు, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం పొడివాతావరణం ఉంటుంది. గాలిలో తేమ సాధారణంకన్నా అధికంగా ఉంది. తెల్లవారుజామున పొగమంచు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ శాఖ సూచించింది.
ఇవీ చదవండి: