అనంతపురం జిల్లా రాప్తాడు.. 44వ జాతీయ రహదారిపై తనిఖీల్లో రూ. 21లక్షల విలువచేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. గుట్కా ప్యాకెట్లను సరఫరా చేస్తున్న వడ్ల మోహన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ భాస్కర్ గౌడ్ తెలిపారు.
నిందితుడిది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అని తెలిపారు. గుట్కా ప్యాకెట్ల తరలింపునకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
ఇదీ చదవండి: గుట్కా విక్రయాలపై పోలీసుల దాడులు.. భారీగా సరకు పట్టివేత