అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 30 ఇసుక ఎడ్ల బండ్లను అనంతపురం జిల్లా ధర్మవరం మండలం తుంపర్తి సమీపంలోని చిత్రావతి నది వద్ద పోలీసులు పట్టుకున్నారు. బుధవారం ఎస్ఈబీ బృందం, ధర్మవరం గ్రామీణ పోలీసులు కలిసి నిర్వహించిన దాడుల్లో ఇసుక బండ్లను గుర్తించి... ధర్మవరం గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: