అనంతపురం జిల్లా మడకశిరలో ఓ ప్రైవేటు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. భోగి మంటల నడుమ కోలాటంతో సంప్రదాయ నృత్యాలు చేశారు. విద్యార్థులు వేసిన రంగవల్లుల ఆకట్టుకున్నాయి. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రస్తుత తరానికి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకే వేడుకలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి: Ghattamaneni Ramesh babu: ఘట్టమనేని రమేశ్‌బాబు మృతి పట్ల చంద్రబాబు సంతాపం