ETV Bharat / state

bills pending: నాడు ఉన్నవన్నీ అమ్మి అన్నం పెట్టాడు.. నేడు పైసా రాక ఇబ్బందులు పడుతున్నాడు..!

bills pending from government: కరోనా మొదటి దశ సమయంలో ప్రాణాలకు తెగించి రోగులను కాపాడిన వైద్యుల కడుపు నింపాడు. ఆలస్యమైనా సర్కారు డబ్బులిస్తుందని.. ఉన్న ఇంటినీ, భార్య నగలను కూడా అమ్మి వారి తిండి కోసం ఖర్చు చేశాడు. కానీ ప్రభుత్వం నుంచి పైసా రాలేదు. అధికారుల చుట్టూ తిరిగీ తిరిగీ.. ప్రమాదంలో కాళ్లను కూడా కోల్పోయాడు. ఇంత జరిగినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమంటూ కన్నీటిపర్యంతమవుతున్నాడు హిందూపురానికి చెందిన సత్యనారాయణ.

satyanarayana-who-was-having-trouble-getting-money-put-food-for-the-doctors-during-the-corona
నాడు ఉన్నవన్నీ అమ్మి అన్నం పెట్టాడు.. నేడు పైసా రాక ఇబ్బందులు పడుతున్నాడు..!
author img

By

Published : Dec 3, 2021, 10:38 AM IST

food for doctors: కరోనా తొలిదశ సమయంలో అనంతపురం జిల్లాలో కొవిడ్‌ మొదటి కేసు హిందూపురంలో నమోదైంది. పట్టణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించి, వైరస్‌ కట్టడికి అధికార యంత్రాంగాన్ని, వైద్యులను మోహరించారు. వారికి నీళ్లు, భోజనం అందించడానికి ఎవరూ ధైర్యం చేయలేదు. ‘బిల్లు బాధ్యత మాది.. భోజనం పెట్టండి’ అని ఓ రెవెన్యూ అధికారి ఇచ్చిన భరోసాతో.. హిందూపురంలోని పైప్‌లైన్‌ రోడ్డుకు చెందిన సత్యనారాయణ ముందుకొచ్చారు. మొత్తం 36 మంది వైద్యులు, అధికారులకు 2020 మే నుంచి సెప్టెంబరు వరకు మూడు పూటలా భోజనం అందించారు. అయిదు నెలలకు రూ.9.50 లక్షల బిల్లు అయింది. అధికారులు చెల్లించకపోవడంతో భోజనం సరఫరా నిలిపివేశారు. ఆ సమయంలో ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ‘రెండు నెలలు అన్నం పెట్టు.. వీటి సొమ్ము నేనే ఇస్తా’ అంటూ హామీ ఇచ్చారు. ఆయన్ని నమ్మి సత్యనారాయణ మరో రెండు నెలలు భోజనం పెట్టారు. దానికి అదనంగా రూ.2 లక్షలు అయింది. ఇప్పటివరకు పైసా అందలేదు.

కలల ఇంటినీ, భార్య నగలనూ విక్రయించి..

facing problems due to pending bills: భోజనం తయారీకి చేసిన అప్పులు, వాటి వడ్డీలు పెరిగిపోయాయి. బిల్లులు రాకపోవడంతో ఎంతో కష్టపడి నిర్మించుకున్న చిన్న ఇంటిని తక్కువ ధరకే అమ్మేశారు. అప్పు తీరకపోవడంతో భార్య మూడు తులాల నగలనూ విక్రయించాల్సి వచ్చింది. అయినా... రూ.2 లక్షలు అప్పు మిగిలే ఉంది. బిల్లుల కోసం తహసీల్దార్‌, సబ్‌ కలెక్టర్‌, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ఒకరోజు తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి, ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. కాలు విరగడంతో ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకొన్నారు. అది వికటించడంతో మరోసారి ఆపరేషన్‌ చేయించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. అధికారుల మాటలు నమ్మి... ఆపద సమయంలో ఆదుకున్నందుకు తాను రోడ్డుమీద పడ్డానని, కాపాడాలని బాధితుడు విలపిస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్‌ శ్రీనివాసులును వివరణ కోరగా.. ‘సత్యనారాయణకు రావాల్సిన బిల్లులను ఉన్నతాధికారులకు పంపాం. పెండింగ్‌ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో మంజూరు అవుతాయి’’ అని ఆయన వివరించారు.

ఇదీ చూడండి:

Weather Update: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం.. ఉత్తరాంధ్రలో వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.