ETV Bharat / state

అప్పులు చేసి పల్లెలను అభివృద్ధి చేశాం.. నిధులు మంజూరు చేయండి మహోప్రభో: సర్పంచులు - Paritala Sunitha news

Sarpanchs protest against YSRCP government: రాష్ట్రంలో పల్లెల అభివృద్ధిని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని.. సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి గ్రామ పంచాయితీలను అభివృద్ధి చేసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయటంలేదంటూ గుండ్లు కొట్టించుకోని నిరసనకు దిగారు. నిరసన చేపట్టిన సర్పంచులకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి పరిటాల సునీత.. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Sarpanchs
Sarpanchs
author img

By

Published : Jun 20, 2023, 9:38 PM IST

Sarpanchs protest against YSRCP government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులకు, వార్డు మెంబర్లకు తిప్పలు తప్పటం లేదు. అప్పులు చేసి తమ పల్లెలను అభివృద్ధి చేసుకుంటే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలకాక సర్పంచుల కుటుంబాలు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి.. నిధులు మంజూరు చేయండి మహోప్రభో అంటూ సర్పంచులు.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ నిరసనలు, ధర్నాలు చేస్తున్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

గుండు కొట్టించుకోని నిరసనకు దిగిన సర్పంచులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నేటిదాకా పల్లెల అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని.. అనంతపురం జిల్లాకు చెందిన సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులనూ.. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని వాపోయారు. గత నాలుగేళ్లుగా స్థానిక సంస్థల పట్ల జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన చెందారు. ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలంటూ.. రాప్తాడు మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద సర్పంచులు గుండు కొట్టించుకోని నిరసన చేపట్టారు.

సీఎం జగన్‌పై సర్పంచులు ఆగ్రహం.. అనంతపురం జిల్లా రాప్తాడు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఈరోజు సర్పంచులు గుండు కొట్టించుకుని నిరసనకు దిగారు. పల్లెల అభివృద్ధి కోసం లక్షల్లో అప్పులు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఎంపీడీవోకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ క్రమంలో రాప్తాడులో నిరసన చేపట్టిన సర్పంచులకు మాజీ మంత్రి పరిటాల సునీత సంఘీభావం తెలిపారు.

వైసీపీ హయంలో సర్పంచులకు విలువే లేదు.. పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని సర్పంచులకు విలువ లేకుండా చేసిందని మండిపడ్డారు. పల్లెల అభివృద్ధిని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలైనా నిధులను జగన్ రెడ్డి ప్రభుత్వం దారి మళ్లిస్తోందని దుయ్యబట్టారు. దీంతో పంచాయతీల అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్న ఆమె.. పంచాయతీలను అభివృద్ధి చేయలేక చాలా మంది సర్పంచులు గ్రామాలను వదిలి వెళ్తున్నారని గుర్తు చేశారు. ప్రజల సమస్యలను చూసిన సర్పంచులు..అప్పులు చేసి పారిశుద్ధ్య పనులు నుంచి అభివృద్ధి పనులు చేస్తున్న ఈ ప్రభుత్వం కనీసం వాళ్లకు ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదని ఆమె విమర్శించారు.

''వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సర్పంచ్ అంటేనే విలువ లేకుండా పోయింది. సర్పంచులకు విలువ ఇవ్వనప్పుడు ఎందుకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టారో అర్థం కావటం లేదు. రెండేళ్ల మూడు నెలలుగా సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయటంలేదు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ. 8వేల 600 కోట్లు ఇచ్చింది. ఆ డబ్బులు సర్పంచుల ఖాతాల్లో పడకముందే జగన్ మోహన్ రెడ్డి దారి మళ్లించారు. గ్రామాల్లో పరిస్థితులు నీళ్లు లేక, డ్రైనేజీలు శుభ్రంగా లేక, రోడ్లు సరిగ్గా లేక, స్తంభాలకు సరైన లైట్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పల్లెల అభివృద్ధిని పట్టించుకోకుండా సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు సర్పంచులను అప్పులపాలు చేసి రోడ్డున పడేశాడు''- పరిటాల సునీత, మాజీ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.