నెల్లూరులో విధి నిర్వహణలో ఉన్న సచివాలయ ఉద్యోగిపై ఎస్సై దాడి చేయటాన్ని గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల అసోషియేషన్ తీవ్రంగా ఖండించింది. గురువారం విధులకు వెళ్తున్న అడ్మినిస్ట్రేషన్ సెకట్రరీపై.. స్థానిక ఎస్సై వివరాలు కనుక్కోకుండా దాడి చేశారని.. విధులకు వెళ్తున్నానని చెబుతున్నా వినకుండా కొట్టారని ఆరోపించారు. అనంతపురంలో మాట్లాడిన సచివాలయ ఉద్యోగులు.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ విధించిన నాటి నుంచి శక్తికి మించి పనిచేస్తున్నామని చెప్పారు. అలాంటి సమయంలో ఇలా దాడి చేయడం సబబు కాదన్నారు. సచివాయలం ఉద్యోగిపై దాడి చేసిన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: