అనంతపురం జిల్లాలో 22 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసులు తెలిపారు. ఉదయగిరి పట్టణంలోని బీసీ, ఎస్టీ కాలనీలకు నీటి సరఫరా పునరుద్ధరణ కోసం చేస్తున్న పైపులైన్ మరమ్మతుల పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి, ట్యాంకులను క్లోరినేషన్ చేసి కాలనీలకు నీటి సరఫరా చేయాలని ఎంపీడీవో వీరాస్వామి, సంబంధిత అధికారులకు సూచించారు.
వింజమూరు మండలంలో 14 గ్రామాలకు, బోగోలు మండలంలో 6 గ్రామాలకు, వరికుంటపాడు మండలంలో 2 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. వేసవి దృష్ట్యా జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి కంటింజెంట్ యాక్షన్ ప్లాన్ కింద రూ. 11.32 కోట్లతో ప్రతిపాదనలు పంపగా నిధులు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇవీ చదవండి.. నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడి