ETV Bharat / state

పట్టపగలే ...ఆర్టీసీ డిపోలో బస్సును కొట్టేశాడు. - ధర్మవరం ఆర్టీసీ డిపోలో బస్సు చోరీ

ఆర్టీసీ డిపోలో ఉన్న బస్సునే కొట్టేశాడో ఘనుడు. పట్టపగలే.. బస్సును డిపో నుంచే ఎత్తుకెళ్లాడు. అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపో నుంచి బస్సును ఎత్తుకెళ్తుండగా డిపో సిబ్బంది.. వాహనం వెనకాలే ప్రయాణించి.. పట్టుకున్నారు.

rtc bus theft at dharmavaram rtc depot
ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీబస్సు దొంగతనం
author img

By

Published : May 22, 2020, 5:08 PM IST

ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీబస్సు దొంగతనం

అనంతపురం జిల్లా ధర్మవరం ఆర్టీసీ డిపో నుంచి పట్టపగలే ఒక దుండగుడు ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. డిపో నుంచి బస్సు బయటకు వేగంగా వెళ్లడంతో....ఆర్టీసీ సిబ్బంది అవాక్కయ్యారు. ధర్మవరం పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా మామిళ్ళపల్లి జాతీయరహదారిపైకి చేరుకున్న బస్సు ...అతివేగంగా చిన్న కొత్తపల్లి మీదుగా పెనుగొండ వైపు పరుగులు తీసింది. ఆ బస్సు డ్రైవర్ ..వాహనాన్ని అనుకరిస్తూ.. పోలీసులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు జాతీయ రహదారిపై బస్సును వెంబడించారు. కియా పరిశ్రమ వద్ద రహదారిపై... కంటైనర్​ను పోలీసులు అడ్డుపెట్టి.. బస్సును ఆపారు. వెంటనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దుండగుడిది బెంగళూరులోని విజయపుర అని ...పేరు మజమల్ ఖాన్ అని పోలీసులు తెలిపారు. ధర్మవరం ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లికార్జున ఫిర్యాదు మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి. పవన్​కల్యాణ్​ను విమర్శిస్తే ఊరుకోం: మహేష్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.