అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఆర్టీసి డిపో ఎదురుగా ఉన్న విజయలక్ష్మి ఎరువుల దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం పైఉన్న ఇనుపరేకును కోసి లోపలికి ప్రవేశించి డబ్బులు, పలు విలువైన వస్తువులు దొంగలించినట్లు దుకాణం యజమాని వన్నూరు స్వామి తెలిపారు.
రెండు రోజులు దుకాణం మూసివేసిన యజమాని… ఉదయం వెళ్లి చూడగానే రేకులు కోసి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గతంలోనూ ఇదే తరహా దొంగతనం పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో మొబైల్ షాప్లో జరిగింది. ఈ చోరీలు ఒకరే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: