Roads Damaged in Anantapur district: అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా 230 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఈమేరకు అనంతపురం జిల్లా కలెక్టరేట్లో వరద నష్టంపై.. ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి(minister botcha Satyanarayana review on damaged roads due to floods in Anantapur district) సమీక్షించారు. జిల్లాలో దెబ్బతిన్న రహదారులకు వెంటనే మరమ్మతు నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. 47 చోట్ల రోడ్లు బాగా దెబ్బతినడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని గుర్తించి.. 41 చోట్ల మరమ్మతులు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు.
తరుచూ వాగులు, వంకలు పొర్లుతూ రహదారులు దెబ్బతింటున్న చోట కల్వర్టు నిర్మాణాల కోసం డీపీఆర్‌లు సిద్ధం చేయాలని ఆదేశించామన్నారు. వర్షాలతో రహదారులు కొట్టుకపోయినచోట బీటీ, గ్రావెల్‌తో రహదారులు నిర్మించనున్నట్లు మంత్రి చెప్పారు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు విషయంలో ఎవరిపైనా వత్తిడి లేదని.. లబ్దిదారులకే ఐచ్ఛికం ఇచ్చామన్నారు. గతంలో ఆస్తులు అమ్ముకోటానికి, తనఖా పెట్టడానికి అవకాశం లేదని.. సంపూర్ణ గృహ హక్కుతో పేదలకు హక్కు కల్పించినట్లు మంత్రి బొత్స(minister botcha on Roads Damaged in Anantapur) తెలిపారు. పంట నష్టపోయిన రైతులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి బొత్స హామీ ఇచ్చారు.