అనంతపురం జిల్లా కదిరిలో ప్రధాన రహదారి విస్తరణ వ్యవహారం.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య పరస్పర ఆరోపణలకు దారితీసింది. సొంత ఆస్తులను కాపాడుకునేందుకు తెలుగుదేశం నేత కందికుంట వెంకటప్రసాద్ రెడ్డి విస్తరణ పనులు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కందికుంట వెంకటప్రసాద్.. విస్తరణ కోసం భవనాలు, భూములు కోల్పోతున్న పేదలకు పరిహారం తెప్పించాలని సవాల్ విసిరారు. తాను రూపాయి తీసుకోకుండానే సొంత భవన సముదాయాన్ని కూలుస్తానని మాట ఇచ్చారు.
ఇదీ చదవండి: