అనంతపురం జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని రవాణా శాఖ తనిఖీ అధికారి వరప్రసాద్ పిలుపునిచ్చారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అనంతపురంలో పోలీసు శాఖ, రవాణా శాఖ... విద్యార్థులతో కలిసి నగరంలోని ప్రధాన కూడళ్లలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వాహనదారుడు నడుచుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు ప్రజల్లో అవగాహన కల్పించటానికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి నిదానమే ప్రధానంగా ప్రయాణం సాగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని తెలిపారు.
ఇదీ చదవండి: