అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని కదిరి - హిందూపురం ప్రధాన రహదారి విస్తరణ కోసం కొలతల ప్రక్రియను అధికారులు మరోసారి చేపట్టారు. మూడునెలల్లో ఐదో దఫా రహదారి విస్తరణకు కొలతలు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు ఆక్రమణలు గుర్తించిన అధికారులు.. కొలతలు తీసుకున్న ప్రతీసారి మార్కింగ్ ఇచ్చారు. అయితే కొలతలు చేపట్టినప్పుడల్లా మార్కింగ్లు మారుతున్నాయంటూ స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం కొలతలు ప్రారంభించిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు.. గతానికంటే భిన్నంగా చేపట్టారంటూ ఆరోపించారు. అడుగుల దూరంలోనే ఒక్కోచోట ఒక్కోలా మార్కింగ్ ఇస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రస్తుతం ఇస్తున్న మార్కింగే ఫైనలంటూ సిబ్బందికి పనులు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రోడ్డు విస్తరణ పనులు సంగతేమో కానీ కొలతలతోనే కాలయాపన చేస్తున్నారన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రధానోపాధ్యాయురాలుగా తొమ్మిదో తరగతి విద్యార్థి